‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ మూవీ విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన మేకర్స్‌

6 Jul, 2021 20:36 IST|Sakshi

‘కేజీఎఫ్‌’ మూవీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేనవసరం. ఎలాంటి అంచనాలు లేకుండా 2018 విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సిక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.  

దీంతో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటనపై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 శాతం ఆక్యూపెన్సితో థియేటర్ల ఓపెనింగ్‌కు ప్రభుత్వాలు అనుమనితిని ఇచ్చాయి. అయినప్పటికీ మేకర్స్‌ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనే అనుమానంతో సినిమాల విడుదలపై వెనకడుగు వేస్తున్నారు.

అంతేగాక థర్డ్‌వేవ్‌ కూడా పొంచి ఉండటంతో మేకర్స్‌ డైలామాలో పడుతున్నారు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ మూవీ మేకర్స్‌  తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ‘గ్యాంగస్టర్స్‌తో హాల్‌ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పడే మాన్‌స్టర్‌ వస్తాడు. ఆయన వచ్చే తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ తమదైన శైలిలో మేకర్స్‌ పోస్టర్‌ విడుదల చేశారు. కాగా ప్రశాంత్‌ నీల్‌దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియర్‌ నటి ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు