కేజీఎఫ్ 2లో విల‌క్ష‌ణ న‌టుడు

26 Aug, 2020 17:49 IST|Sakshi

ద‌క్షిణాదిన బంప‌ర్ హిట్ అందుకున్న కేజీఎఫ్ చిత్రానికి కొన‌సాగింపుగా రూపొందుతున్న సినిమా కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2. ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా అర్ధాంత‌రంగా ఆగిపోయింది. అయితే సుదీర్ఘ విరామం త‌ర్వాత ఇటీవ‌లే కేంద్రం షూటింగ్స్‌కు ప‌చ్చ‌జెండా ఊపిన విష‌యం తెలిసిందే. కానీ కోవిడ్ భ‌యంతో కొంద‌రు షూటింగ్‌లు చేయ‌డానికి ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తుంటే, కేజీఎఫ్ టీమ్ మాత్రం ధైర్యంగా రంగంలోకి దిగింది. సుమారు ఆరు నెలల‌ త‌ర్వాత ఈ సినిమా చిత్రీక‌ర‌ణ నేడు(బుధ‌వారం) పున‌:ప‌్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు సోష‌ల్ మీడియాలో చిత్రయూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. (చ‌ద‌వండి: ‘ఆ రోజు సుశాంత్‌ డ్రగ్‌ డీలర్‌ని కలిశాడు’)

ఇదిలా వుంటే ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ న‌టిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ లొకేష‌న్‌లో షూటింగ్‌కు రెడీ అయిన ఫొటోల‌ను షేర్ చేశారు. ఒక‌దాంట్లో ప్ర‌కాశ్ సూట్ వేసుకుని క‌నిపిస్తుండ‌గా, మ‌రో దాంట్లో ద‌ర్శ‌కుడు సీన్ గురించి చెప్తుంటే ప్ర‌కాశ్ రాజ్‌ వింటూ క‌నిపిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే ఇందులో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీరాగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ కూడా చేర‌డంతో కేజీఎఫ్‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లైంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం ద్వారా నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తారు. (చ‌ద‌వండి: బ్యాక్‌గ్రౌండ్‌ అలా వర్కవుట్‌ అవుతుంది)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా