KGF Chapter 2: అధీరాగా సంజయ్‌ దత్‌ లుక్‌ చూశారా?

29 Jul, 2021 11:40 IST|Sakshi

HBD Sanjay Dutt: కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’. కేజీఎఫ్‌ ఘన విజయంతో ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ పాన్‌ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం(జులై29)న సంజయ్‌ దత్‌ బర్త్‌డే సందర్భంగా 'కేజీఎఫ్ 2'లో అధీరాగా విలన్ పాత్ర చేస్తున్న సంజయ్‌ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

చేతిలో ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజయ్‌ లుక్‌ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని ఇప్పటికే మేకర్స్‌ వెల్లడించారు. దీంతో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2పై పాన్‌ఇండియా లెవల్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే వెల్లడి కానుంది. 

మరిన్ని వార్తలు