కేజీఎఫ్‌-2: హైదరాబాద్‌ చేరుకున్న రాకీ భాయ్‌

26 Nov, 2020 17:01 IST|Sakshi

కన్నడ నటుడు యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2’. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఈ రోజు(గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమవ్వగా డిసెంబర్‌ చివరి నాటికి పూర్తవనుంది. ఇందుకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ వేశారు. ఈ క్రమంలో గురువారం యశ్‌ బెంగుళూరు నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో యశ్‌ కెమెరాల కంటికి చిక్కారు. ఈ ఫోటోలో ఆరెంజ్‌ కలర్‌ టీ షర్టులో, మాస్కు ధరించి హ్యండ్‌సమ్‌ లుక్‌లో‌ అదిరిపోయాడు. చదవండి: కేజీఎఫ్‌.. ఛాప్టర్‌: 2: అధీరా రెడీ..

కాగా 2018లో విడుదలైన కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)కు ఈ సినిమా రెండో భాగం. ‘కేజీయఫ్‌ – ఛాప్టర్‌ 1 ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. రాకీ భాయ్‌గా యశ్‌ అవతారమెత్తిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అంతే అంచనాలతో ప్రస్తుతం ఛాప్టర్‌ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌ అధీరా పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. డిసెంబర్‌ 6న షూటింగ్‌లో పాల్గొని తన పాత్ర చితత్రీకరణ ముగిసే వరకూ షూటింగ్‌లో భాగమవ్వనున్నరని సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: ‘రాకీ భాయ్’‌నే బోల్తా కొట్టించిన ఐరా..!

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు