అల్లు అర్జున్‌ను కలిసి ‘కేజీఎఫ్’‌ డైరెక్టర్‌.. ఫొటో వైరల్‌

9 Mar, 2021 16:39 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అందుకే అభిమానులంత అతడిని ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. ఇక నటన, డ్యాన్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఎర్పరుచుకున్న బన్నీ ప్యాన్‌ ఇండియా నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్మ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్‌ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ను కలిసి కథ విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక మంగళవారం(ఫిబ్రవరి 9) దర్శకుడు ప్రశాంత్‌ నీల్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో బన్నీని కలిసి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బన్నీకి ప్రశాంత్‌ కథ వివరించాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ రానుందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

అనంతరం గీతా ఆర్ట్స్‌ ఆఫీసు ముందు బన్నీ అభిమానులను కలిసిన ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల అర్జున్‌ తన 10వ వివాహ వార్షికోత్సవ వేడుకను భార్య స్నేహ రెడ్డితో కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజ్‌మహాల్‌ వద్ద స్నేహరెడ్డితో కలిసి తీసుకున్న ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. కాగా అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ను సుకుమార్‌ ఎర్ర చందనం స్మగ్లీంగ్‌ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మీక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

చదవండి: 
బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్‌
 
అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్‌ వద్ద బన్నీ, స్నేహ హల్‌చల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు