‘శాసన సభ’ కు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం

22 Sep, 2022 10:12 IST|Sakshi
షణ్ముగం, రవి బస్రూర్‌

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ సంగీతదర్శకుడు రవి బస్రూర్‌ వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నారు. తాజాగా ‘శాసన సభ’ చిత్రానికి సంగీతదర్శకుడిగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్‌ జంటగా రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ఇది. వేణు మడికంటి దర్శకత్వంలో తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ–‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. యూనివర్శల్‌ కథాంశంతో నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మెయిన్‌  పిల్లర్‌గా ఉంటాయి. ‘కేజీఎఫ్‌–2’ తర్వాత తెలుగులో ఆయన్నుంచి వస్తున్న చిత్రమిది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.   

మరిన్ని వార్తలు