కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ ఫామ్‌హౌజ్‌ చూశారా?

5 May, 2021 10:24 IST|Sakshi

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా యశ్‌ తలరాతను మార్చేసింది. అతడిని స్టార్‌ హీరోగా అందలం ఎక్కించింది. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది ఇండస్ట్రీ గర్వపడేలా చేసింది. అప్పట్లో బాహుబలి 2 కోసం జనాలు ఎంతలా ఎదురుచూశారో ఇప్పుడు కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం జూలై 16న రిలీజ్‌ అవుతున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా ఆ టైం వరకు సినిమాను కంప్లీట్‌ చేయాల్సిందేనని ప్లాన్‌ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అయితే ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువయ్యిందని సమాచారం. ఎలాగో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కాబట్టి నిడివి ఎక్కువగా ఉన్నా చూస్తారని, కాబట్టి లెంగ్తీ రన్‌ టైంతోనే నడిపించాలని డైరెక్టర్‌ ఫిక్స్‌ అయినట్లు వినికిడి. ఇక ఈ సినిమా కోసం యశ్‌ దాదాపు రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. 

ఇదిలా వుంటే కరోనా వల్ల సినిమా షూటింగ్స్‌కు కొంత బ్రేక్‌ పడటంతో యశ్‌ తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లాడు. అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో యశ్‌.. జేసీబీలతో తన పొలాన్ని పంటకు సిద్ధం చేయిస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలో దగ్గరుండి ఆదేశాలిస్తున్నాడు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..

చదవండి: వైరల్‌: విలాసవంతమైన యశ్‌ ఇల్లు చూసేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు