కన్నడ స్టార్‌ హీరో యష్‌తో పూరి జగన్నాథ్‌!.. స్టోరీ లైన్‌ అదేనా?

22 May, 2021 12:28 IST|Sakshi

పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో లైగర్‌ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్‌డేటస్‌ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ మాస్‌ డైరెక్టర్‌ కన్నడ స్టార్‌ హీరో యష్‌తో పాన్‌ ఇండియా సినిమా చేయనున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'కేజీఎఫ్' హిట్‌తో యష్‌కు ఎంతటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క సినిమా అతడిని స్టార్‌ హీరోగా అందలం ఎక్కించింది. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు  'ఇస్మార్ట్ శంకర్' తో పూరికి మంచి కంబ్యాక్‌ లభించిందని చెప్పొచ్చు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో పొలిటికల్‌ బ్యాక్‌బ్రాప్‌లో సినిమా రానుందంటూ ఇండస్ర్టీలో టాక్‌ వినిపిస్తోంది. 'కేజీఎఫ్' హిట్ తరువాత పూరి కథ వినిపించడం, వెంటనే యష్‌ ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. తెలుగులో దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించిన కొత్తలో పూరి జగన్నాథ్‌ రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 

చదవండి : నా భర్తకు తెలియకుండా పూరి జగన్నాథ్‌కి డబ్బులిచ్చేదాన్ని : హేమ
విజయ్‌పై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు