Yash: భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌

27 Apr, 2022 12:32 IST|Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్‌ కెరీర్‌నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌-2 కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

అయితే మొన్నటివరకు షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా గడిపిన యశ్‌ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్‌ భార్య రాధిక పండిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: పబ్‌ ఇన్సిడెంట్‌ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక

A post shared by Radhika Pandit (@iamradhikapandit)

మరిన్ని వార్తలు