కేజీఎఫ్‌2 సర్‌ప్రైజ్‌ : యశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌

21 Dec, 2020 10:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మోస్ట్‌  ఎవైటెడ్‌  మూవీ కేజీఎఫ్‌-2 నుంచి మరో సర్‌ఫ్రైజ్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌.  సోమవారం ఈ సినిమాకు సంబంధించి గ్లింప్లెస్‌ను  రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా జనవరి  8న  టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.  జనవరి 8 ఈ మూవీ హీరో యశ్ పుట్టిన రోజు కూడా.  ఆయన బర్త్‌ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ అందించనున్నారన్నమాట.

కేజీఎఫ్ సినిమా భారీ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ కేజీఎఫ్ చాప్టర్‌2 ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  శరవేగంగా షూటింగ్‌ కార‍్యక్రమాలను పూర్తి చేసుకున్న కేజీఎఫ్‌2 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు కేజీఎఫ్-2 ద్వారా సమాధానం దొరకనుందని సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.  అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్‌ దాదాపు పూర్తి  చేసుకున్న ఈ  మూవీ ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది  వేసవికి ఈ సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు