సూర్య వర్సెస్‌ కార్తి.. ఖైదీ సీక్వెల్ కు లైన్ క్లియర్

5 Jun, 2022 17:17 IST|Sakshi

కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి కలసి నటిస్తే చూడాలని చాలా కాలంగా సౌత్ ఇండియా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురు చూపులు ఫలించాయి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ క్లైమాక్స్ లో ఖైదీ 2కు సంబంధించిన అఫీసియల్ లీడ్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్‌. అంతేకాదు సీక్వెల్ స్టోరీని కూడా కొంత లీక్ చేసాడు. ఈ సిక్వెల్‌ని అన్నదమ్ముల సవాల్‌గా మార్చాడు లోకేష్‌. ఖైదీ సీక్వెల్‌లో విలన్‌గా సూర్య, హీరోగా కార్తి నటించబోతున్నారు. వీరికి తోడు కమల్‌ హాసన్‌ కూడా గెస్ట్‌ రోల్‌ చేస్తే.. ఖైదీ 2 బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.

(చదవండి: ‘విక్రమ్‌’ మూవీ రివ్యూ)

అయితే ఇప్పటికిప్పుడు ఖైదీ2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. సూర్య, కార్తిల మధ్య యుద్దం మొదలవడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేతి నిండా సినిమాలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. మరో వైపు లోకేష్‌ కూడా ఇప్పట్లో ఈ సీక్వెల్‌ని తెరకెక్కించే అవకాశం లేదు. త్వరలోనే ఆయన హీరో విజయ్‌ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాతే వీరు ముగ్గరు ఖైదీ 2తో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు