అజయ్‌ దేవగణ్‌ భార్యగా కాజల్‌..

10 Jun, 2021 00:05 IST|Sakshi
అజయ్‌ దేవగణ్‌, కాజల్‌ అగర్వాల్‌

హిందీ హీరో అజయ్‌ దేవగణ్‌తో కాజల్‌ అగర్వాల్‌ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించారు కాజల్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్‌–కాజల్‌ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్‌. అయితే తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారని ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు