ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..

8 May, 2021 14:22 IST|Sakshi

ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్‌ కే ఖిలాడీ' పదకొండవ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్‌లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ ఫేం రాహుల్‌ వైద్య, వరుణ్‌ సూద్‌, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌ ప్రియురాలు దిషా పర్మార్‌ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్‌ అయ్యారు.


ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్‌ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్‌ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హిందీ బిగ్‌బాస్-‌14లో రుబీనా దిలైక్‌తో తలపడి రాహుల్‌ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్‌ని కూడా పరిచయం చేసిన రాహుల్‌ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం  ఖత్రోన్‌ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్‌పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్‌ మదనపడుతూ కనిపించాడు. 

A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_)

ఛదవండి : 'బిగ్‌బాస్'‌ వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి
నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు