రవితేజ ‘ఖిలాడి’ టీజర్‌ మాములుగా లేదుగా..

12 Apr, 2021 10:56 IST|Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 28న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌  స్పీడ్‌ పెంచారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌ ‘ఖిలాడి’టీజర్‌ని విడుదలచేసింది. ఉగాది కానుకగా విడుదలైన ఈ టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో రవితేజ చాలా స్టైలీష్‌గా కనిపించాడు.

ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం నేపథ్య సంగీతంలోనే ఆసక్తిపెంచేలా టీజర్‌ని తీర్చిదిద్దారు. ‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌ యు ఆర్‌ అన్‌స్టాపబుల్‌’ అనే రవితేజ డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.


చదవండి:
జాతిరత్నాలు’పై మంత్రి కేటీఆర్‌ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు