నటి ఖుష్బూని కమిట్‌మెంట్‌ అడిగిన స్టార్‌ ఎవరో తెలుసా?

8 Jul, 2021 11:34 IST|Sakshi

కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా చక్రం​ తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో నటించి తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకున్న స్టార్‌ ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు.


తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్‌గా ఖుష్బూ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది. తాజాగా తన సినీ కెరీర్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్‌గా ఉన్న సమయంలో తెలుగులో ఓ స్టార్‌ హీరో తనను కమిట్‌మెంట్‌ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్‌ హీరో అయి ఉండి అలా కమిట్‌మెంట్‌ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్‌మెంట్‌ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమ‌నిపించే ఆన్స‌ర్ ఇచ్చిందట.


ఖుష్బూ చెప్పిన సమాధానం విని  ఆ హీరో షాక్‌ అయ్యాడని, ఇక అప్పటి నుంచి తామిద్దరి మధ్యా మాటలు లేవని ఖుష్బూ పేర్కొంది. అయితే తనను కమిట్‌మెంట్‌ అడిగిన ఆ స్టార్‌ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్‌ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు. ఖుష్బూ తెలుగులో చేసింది కూడా తక్కువ సినిమాలే కావడం, వాటిలో కూతుళ్లు ఉన్న స్టార్‌ హీరోలు ఎవరుంటారబ్బా అని నెట్టింట సెర్చింగ్‌ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఖుష్బూ నటించిన చివరి సినిమా అజ్ఞాతవాసి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు