శంకర్‌-చరణ్‌ మూవీలో హీరోయిన్‌ ఖరారు.. ఆమె ఎవరంటే!

19 Jun, 2021 19:20 IST|Sakshi

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవల ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుని సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్దమైంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ పరిశ్రమలకు చెందిన పులువురు స్టార్‌ నటీనటులు నటించనున్నట్లు వినికిడి. అలాగే ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ను అనుకున్నారని, ఆమెతో చిత్ర బృందం చర్చలు కూడా జరిపినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చివరకు మేకర్స్‌ కియారా అద్వానీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్‌ శంకర్‌, నిర్మాత దిల్‌ రాజులు అన్ని విదాల చర్చించుకుని చెర్రికి జోడిగా కియారాను ఓకే చేసినట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా గతంలో కియారా చరణ్‌తో ‘వినయ విధేయ రామా’ సినిమాతో రోమాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సరసన ‘భరత్‌ అనే మూవీ’లో వసుమతిగా కియారా ఆకట్టుకుంది. కాగా శంకర్‌పై లైకా ప్రొడక్షన్‌ ఇటీవల కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఇండియన్‌ 2’ మూవీ పూర్తి చేయకుండానే శంకర్‌ మరో కొత్త సినిమాలను తెరకెక్కించెందుకు సిద్దమయ్యాడని లైకా ప్రొడక్షన్‌ ఆరోపణలు చేసింది. దీంతో లైకా ప్రొడక్షన్‌తో ఈ వివాదం కాస్తా సద్దుమనిగిన అనంతరం ఈ మూని శంకర్‌ తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. 

చదవండి: 
టాప్‌లెస్‌ ఫోటో షూట్‌.. కియారా అద్వానీ ఫోటో వైరల్‌
పర్‌ఫెక్ట్‌ పార్ట్‌నర్‌తో బీచ్‌ ఒడ్డున పిక్‌నిక్‌.. ఇంకేం కావాలి: కీర్తి సురేశ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు