కోలీవుడ్‌కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్‌ మూవీ!

6 Jun, 2022 08:08 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు కియారా అద్వానీ.  

మరిన్ని వార్తలు