ప్రియుడి‌ ఇంటికి వెళ్తూ దొరికిన బ్యూటీ‌!

31 Jan, 2021 16:41 IST|Sakshi

తెలిసీ తెలీని వయసులో బ్యూటీ కియారా అద్వానీ ప్రేమలో పడింది. దీంతో ఆమె పేరెంట్స్‌ నీ వయసెంత? నువ్వు చేస్తున్న పనులేంటి? ముందు నీ చదువు మీద దృష్టి పెట్టు అని హెచ్చరించారు. ఇదెప్పుడో స్కూల్‌ డేస్‌లో జరిగిన ఘటన. తర్వాత కియారా స్కూల్‌, కాలేజ్‌ దాటేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి హీరోయిన్‌గా ప్రజాదరణ పొందుతోంది. అదే సమయంలో తోటి నటుడు  సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో పడ్డట్లు ఏడాది కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాడు బాంద్రాలోని సిద్ధార్థ్‌ నివాసానికి వెళ్తూ కియారా దర్శనమివ్వగా నెటిజన్లు ఫొటోలు క్లిక్‌మనిపించారు. (చదవండి: ‘షోలే’ నటుడు కన్నుమూత)

వారిని దాటుకుని ఎలాగోలా సిద్ధార్థ్‌ ఇంటికి చేరుకున్న ఆమె అతడిని వెంటేసుకుని భోజనానికి వెళ్లొచ్చారట. మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ కెమెరాకు దొరికిపోయిన కియారా ఫొటోలు ప్రస్తుతం బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌లోనూ ఈ జంట 2020కి గుడ్‌బాయ్‌ చెప్పేందుకు మాల్దీవులకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కింది. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్‌ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్‌ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్‌ సహనిర్మాతగా వ్యవహరించాడు. (చదవండి: పర్యటనకు వెళుతున్న బాలీవుడ్‌ జంటలు)

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు