రామ్‌చరణ్‌తో జోడీ కట్టనున్న బాలీవుడ్‌ బ్యూటీ!

15 Mar, 2021 08:32 IST|Sakshi

హీరో రామ్‌చరణ్, హీరోయిన్‌ కియారా అద్వానీ మరోసారి జోడీ కట్టనున్నారా? అంటే అవుననే టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ‘దిల్‌’ రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై ఇప్పటికే రష్మికా మందన్నా, కొరియన్‌ బ్యూటీ సుజి పేర్లు వినిపించాయి. తాజాగా కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ ‘వినయ విధేయ రామ’ సినిమాలో చరణ్, కియారా జంటగా నటించిన విషయం తెలిసిందే. మరి.. శంకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా సినిమాతో చరణ్, కియారాల జోడీ రిపీట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)లో చరణ్‌–ఆలియా ఓ జంటగా, ఎన్టీఆర్‌–ఒలీవియా మోరిస్‌ ఓ జంటగా నటిస్తున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్‌చరణ్‌–ఆలియా పోటాపోటీగా డ్యాన్స్‌ చేయనున్నారని సమాచారం. ఏప్రిల్‌లో రామ్‌చరణ్‌–ఆలియా భట్‌పై రెండు పాటలు చిత్రీకరించేందుకు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేశారట. వాటిలో ఒకటి రొమాంటిక్‌ సాంగ్‌ అని టాక్‌. ఒక పాటను ఆలియా స్వయంగా పాడనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాడనున్నది హిందీ వెర్షన్‌కి సంబంధించిన పాట అని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలకానుంది. 

చదవండి: అచ్చం సాయిపల్లవిలా ఉంది కదూ..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు