నా స్థానంలో  హీరో ఉంటే అలాంటి కామెంట్స్‌ చేయరేమో: కియారా

27 Dec, 2021 11:52 IST|Sakshi

Kiara Advani Resonds On Being Trolled After Elderly Man Saluted Her: కబీర్‌ సింగ్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని స్టార్‌డమ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ కియారా అద్వానీ. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్‌ మల్హోత్రాతో ప్రేమలో మునిగితేలుతున్న ఆమె ఆ మధ్య ఓసారి  ప్రియుడి ఇంటికి వెళ్లి ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సిద్దార్థ్‌ అపార్ట్‌మెంట్‌కి కియారా ఎంటర్‌ కాగానే అక్కడున్న సెక్యురిటీ సిబ్బందైన వృద్ధుడు కారు డోర్‌ తెరిచి ఆమెకు సెల్యూట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కియారా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు.

కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా? ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటంటూ కియారాపై విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా దీనిపై స్పందించింది. 'నా స్థానంలో ఒక హీరో ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్‌ చేసేవాళ్లు కాదేమో. అయినా ఎవరూ సెల్యూట్‌ చేయమని అడగరు. ఆయన సెక్యూరిటీ గార్డ్‌ కాబట్టి స్వతహాగా అలా చేశారు. కారులోంచి దిగుతుండగా ఫోటోగ్రాపర్స్‌ వీడియో తీసి తెగ వైరల్‌ చేశారు. నిజానికి ఇది అవనరమైన ట్రోలింగ్‌' అంటూ చెప్పుకొచ్చింది. 

A post shared by Manav Manglani (@manav.manglani)

మరిన్ని వార్తలు