Kiara Advani: సౌత్‌ రీమేక్స్‌ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను

6 May, 2022 16:14 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ సౌత్‌ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్‌ రీమేక్‌ చిత్రాల్లో నటించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానంది. ఆమె హీరోయిన్‌గా నటించిన భూల్‌ భులాయా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఓటీటీలు విస్తృతంగా వ్యాప్తి చెందకముందు కబీర్‌ సింగ్‌ సినిమా చేశాను, దాన్ని ఇప్పుడు మరోసారి చేయమన్నా సరే కళ్లు మూసుకుని ఓకే చెప్తాను. కానీ ఏదైనా రీమేక్‌ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉందంటే దాన్ని చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను.

కొన్ని చిన్న చిత్రాలు రత్నాల్లా ఉంటాయి. వాటిని నిర్దిష్ట భాషలోనే తీస్తారు కనుక ఎక్కువమంది జనాలకు చేరదు. అలాంటప్పుడు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి ఎక్కువమంది జనాలు చూసేలా నిర్మించడంలో తప్పు లేదు' అని చెప్పుకొచ్చింది కియారా. కాగా భూల్‌ భలాయా మే 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక అదే రోజు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించిన ధాకడ్‌ చిత్రం కూడా విడుదల కానుంది.

చదవండి: భళా తందనాన మూవీ ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్‌ ఫొటో.. క్షణాల్లో వైరల్‌

మరిన్ని వార్తలు