Kiccha Sudeep: కిచ్చా సుదీప్‌పై నెట్టింట పుకార్లు.. నిర్మాత క్లారిటీ!

21 Jul, 2022 18:35 IST|Sakshi

బెంగళూరు: కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ నటించిన ‘విక్రాంత్‌ రోణ’ ఈ నెల 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు.

ప్రమోషన్స్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్‌ నిర్వహించాల్సి ఉండగా సుదీప్‌కు ఆరోగ్యం సరిగా లేని కారణంగా అవి వాయిదా పడ్దాయి. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై విక్రాంత్‌ రాణ చిత్ర నిర్మాత స్పందించారు.

నెట్టింట సుదీప్‌పై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో సుదీప్‌ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సుదీప్‌కు కరోనా సోకలేదని, క్షేమంగా ఉన్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

చదవండి: Arjun Kapoor: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో!

మరిన్ని వార్తలు