Kiccha Sudeep: హిందీ భాషపై కిచ్చా సుదీప్‌ సంచలన వ్యాఖ్యలు..

25 Apr, 2022 09:42 IST|Sakshi

Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్‌ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. 

ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్‌ చేశాడు కిచ్చా సుదీప్‌. ఓ ప్రెస్‌ మీట్‌లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్‌ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. 

చదవండి: కిచ్చా సుదీప్‌ 3డీ మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే ?


మరిన్ని వార్తలు