నటుడు కిక్‌ శ్యామ్‌ అరెస్ట్‌, కారణం?

28 Jul, 2020 11:32 IST|Sakshi

చెన్నై: తెలుగులో కిక్, రేసుగుర్రం, కత్తి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శ్యామ్. ఇతనిని కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ  శ్యామ్ తో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా ఇక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు  గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న  శ్యామ్  లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 

చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్‌’ ట్రైలర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు