ఏడేళ్ల వివాహ బంధం.. విడాకులు కోరిన స్టార్‌ కపుల్‌

20 Feb, 2021 10:29 IST|Sakshi

ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్న కిమ్‌-కేస్‌

హాలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌ కపుల్‌ కిమ్‌ కర్దాషియాన్, కేన్‌ వెస్ట్ విడిపోతున్నారనే ఊహాగానాలే నిజమయ్యాయి. తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకులు కావాలని కోరుతూ కిమ్‌ కర్దాషియాన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్టార్‌ కపుల్‌ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా మీడియాలో కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కిమ్‌ కోర్టును ఆశ్రయించింది. ఇక కేస్‌కు ఇది మొదటిసారి విడాకులు కాగా, కిమ్‌కు ఇది మూడోవది. ఇద్దరి  పరస్పర అంగీకారతోనే విడిపోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండేళ్ల డేటింగ్‌ అనంతరం కిమ్‌, కేన్‌ 2014లో ఇటలీలో అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.


ఇద్దరి మధ్యా మనస్పర్థాలు పెరగడంతో తమ ఏడేళ్ల  వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అందుకే గత కొంతకాలంగా వీరిద్దరు వేరేవేరుగా ఉంటున్నారు.  కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని ఉండగా,  కేన్‌ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. అయితే వీరి నలుగురు పిల్లల్ని మాత్రం ఉమ్మడి కస్టడీ కావాలని దంపతులిద్దరూ కోరుతున్నట్లు కిమ్‌ లాయర్‌లారా వాసర్‌ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నాటి నుంచే వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటు చేసుకొన్నాయని సమాచారం. కిమ్‌తో పాటు ఆమె తల్లి కూడా తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన భార్య వింత ప్రవర్తను చాలా బాధ కలిగిస్తుందని కేస్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి డిపప్రెషన్‌లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షోతో దగ్గరైన కిమ్‌-కేస్‌ రెండేళ్ల డేటింగ్‌ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి నార్త్(7), సెయింట్‌(5)తో పాటు 21నెలల కుమారుడు కూడా ఉన్నాడు. 

చదవండి :  (విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి)
              (నేను ‘గే’‌ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు)

మరిన్ని వార్తలు