సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో ఎఫైర్‌: నటి క్లారిటీ!

27 May, 2021 15:14 IST|Sakshi
కిమ్‌ కర్దాషియన్‌, ట్రావిస్‌ బార్కర్‌

హాలీవుడ్‌ ప్రముఖ జంట కిమ్‌ కర్దాషియన్‌, కేన్‌ వెస్ట్‌ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల డేటింగ్‌ అనంతరం కిమ్‌, కేన్‌ 2014లో ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వైవాహిక బంధంలోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇంతలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ మేరకు విడాకులు కోరుతూ ఫిబ్రవరిలో కోర్టుకెక్కారు. ఈ సందర్భంగా నలుగురు పిల్లల బాధ్యతలను ఉమ్మడిగా చూసుకుంటామని న్యాయస్థానానికి తెలియజేశారు. దీంతో వీరికి విడాకులు రావడం తథ్యంగా కనిపిస్తోంది.


కిమ్‌ కర్దాషియన్‌, కేన్‌ వెస్ట్‌

ఇదిలా వుంటే కిమ్‌ కర్దాషియన్‌ తన సోదరి కోర్ట్నీ బాయ్‌ఫ్రెండ్‌ ట్రావిస్‌ బార్కర్‌తో గతంలో డేటింగ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన కిమ్‌ వాటిని తప్పుడు కథనాలుగా కొట్టిపారేసింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ట్రావిస్‌, కోర్ట్‌ ఇద్దరూ వారి రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉన్నారు అని తెలిపింది. కాగా కిమ్‌ కర్దాషియన్‌ విడాకులు తీసుకోవడం ఇది మూడోసారి కాగా కేన్‌కు మొదటిది.

చదవండి: విడాకులు రాకముందే.. కోటీశ్వరుల క్యూ

మరిన్ని వార్తలు