Kim Sharma - Leander Paes: టెన్నిస్‌ స్టార్‌తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!

7 May, 2022 13:25 IST|Sakshi

బాలీవుడ్‌ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్‌ శర్మ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్‌బర్డ్స్‌ తమ ప్రేమను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్‌ శర్మ, పేస్‌ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరి పేరెంట్స్‌ కిమ్‌, పేస్‌ల పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్‌ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్‌-పేస్‌ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను వీరంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు.


కాగా కిమ్‌ కిమ్‌.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్‌ ఎఫైర్స్‌తోనే బాగా పాపులర్‌ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్‌ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్‌ రాణేతో ఎఫైర్‌ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్‌ పేస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. 

మరిన్ని వార్తలు