సగం ఊపిరితిత్తిని తొలగించాం.. సిరివెన్నెల మృతిపై వైద్యుల ప్రకటన

30 Nov, 2021 19:13 IST|Sakshi

Sirivennela Seetharama sastry Death Reasons: ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది.

మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకడంతో ఆపరేషన్‌ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్‌ శరీరమంతా సోకి చివరకు  మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు