ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతార హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతర పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసిన కల్చర్‌న ఇప్పుడు స్క్రీన్‌పై చూడటం చాలా బాగా అనిపించింది అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Nenu chinnapati nunchi maa urilo chusina culture ni screenpaina chudadam chala baga anipinchindi 🔥🔥@shetty_rishab 🔥🔥🔥@hombalefilms @GeethaArts #kanthara pic.twitter.com/uD4nAWSL5R
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 22, 2022