‘సెబాస్టియన్‌ పీసీ.524’ షూటింగ్‌ ప్రారంభం 

3 Dec, 2020 10:12 IST|Sakshi

సాక్షి, మదనపల్లె: ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో ‘సెబాస్టియన్‌ పీసీ.524’ సినిమా షూటింగ్‌ బుధవారం పట్టణంలోని సొసైటీకాలనీ రామాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. రాజావారు రా ణిగారు, ఎస్సార్‌ కల్యాణమండపం ఫేమ్‌ కిరణ్‌ అ బ్బవరం హీరోగా, నూతన దర్శకుడు బాలాజీ స య్యపురెడ్డి దర్శకుడిగా, నమృత థారేకర్, కోమలిప్రసాద్‌ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మదనపల్లె నేపథ్యం కథాంశంగా పోలీ సు ఓరియంటెడ్‌ మూవీగా పట్టణ పరిసర ప్రాంతాల్లో 27 రోజులు సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

పట్టణంలో చారిత్రక కట్టడాలు, చుట్టూ కొండలు, న్యాయస్థానాలు, భవనాలు పాతతరానికి చెందినట్లుగా సహజంగా ఉండడంతో ఇక్కడ సినిమా చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రాజ్‌. కె.నల్లి సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తారని, తప్పకుండా అందరినీ అలరించే మంచి చిత్రమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో సినిమా షూటింగ్‌ జరుగుతుందనే విషయం తెలియడంతో పలువురు చిత్రీకరణను చూసేందుకు ఆసక్తి కనపరిచారు.

సొసైటీకాలనీ రామాలయంలో  ‘సెబాస్టియన్‌ పీసీ.524’ చిత్రబృందం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా