క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో `కిరాత‌క’, రెగ్యుల‌ర్ షూటింగ్‌ ఎప్పుడంటే..

29 Jul, 2021 17:35 IST|Sakshi

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం‘కిరాత‌క‌’.ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు.కిరాత‌క టైటిల్‌తో పాటు ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగించుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ 13నుంచి ప్రారంభంకానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ .. ఆది, వీర‌భ‌ద్ర‌మ్‌ల హిట్‌ కాంబినేష‌న్‌లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో వస్తోన్న చిత్ర‌మిది. మేకింగ్ ప‌రంగా ఎక్కడా కాంప్ర‌మైజ్ టెక్నిక‌ల్‌గా హైస్టాండ‌ర్స్‌లో నిర్మించ‌బోతున్నాం. కిరాత‌క త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే న‌మ్మ‌కం ఉంది’అని అన్నారు. ఆదిసాయి కుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ మధ్య కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు దర్శకుడు ఎం వీరభద్రమ్‌. 

మరిన్ని వార్తలు