ఎంతో ప్రయత్నించాను.. కానీ విడిపోక తప్పలేదు: నటి

25 Jun, 2021 12:34 IST|Sakshi

జీవితంలో శాంతి, సంతోషం కోసం విడాకులు తీసుకున్నాను: కీర్త కుల్హరి

పింక్‌, మిషన్‌ మంగళ్‌, ఫోర్‌ మోర్‌ షార్ట్స్‌ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి కుల్హరి. కొద్ది రోజుల క్రితమే భర్త సాహిల్‌ సెహగల్‌ నుంచి విడిపోయారు కీర్తి. ఈ క్రమంలో ఓ ప్రముఖ డైయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎందుకు భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందో తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి కుల్హరి మాట్లాడుతూ.. ‘‘విడాకులు తీసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఈ నిర్ణయం మా ఇద్దరి జీవితాలనే కాదు.. రెండు కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరమైన జీవితాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమస్యలన్ని నాకు తెలుసు. అందుకే మా బంధాన్ని నిలుపుకోవడం కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ అవేవి సక్సెస్‌ కాలేదు. ఈ వివాహం నాకు సంతోషం, శాంతి కలిగించలేకపోయింది. అందుకే ఈ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు.

‘‘పెళ్లి తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నాను. సాహిల్‌ నా జీవితంలో ఎంతో పెద్ద పాత్ర పోషించాడు. ఈ రోజు నేను ఎవరు.. ఎక్కడ ఎలా ఉన్నాను అనే ది తన ఇచ్చిన ప్రోత్సాహంతోనే సాధ్యపడింది. కానీ నా జీవితంలో శాంతి, సంతోషం కరువయ్యాయి. అందుకే మా బంధానికి ముగింపు పలికాను. విడాకులు తీసుకున్నాను. ముందుకు సాగాను’’ అని తెలిపారు కీర్తి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న నటి తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన విడాకుల గురించి తెలిపారు. ఓ సింపుల్‌ నోట్ ద్వారా మీకొక విషయం తెలపాలనుకుంటున్నాను. నేను, నా భర్త సాహిల్‌ విడిపోవాలని నిర్ణయించుకున్నాము. పేపర్‌ మీద కాదు.. జీవితంలో. విడిపోవడం అనే నిర్ణయం ఎంతో బాధను కలిగిస్తుంది. ఇది అంత సులభం ఏం కాదు. కానీ తప్పదు అంటూ పోస్ట్‌ చేశారు కీర్తి.

చదవండి: భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు