Shilpa Shetty: ఆ ముద్దు కేసును కొట్టి వేయండి.. కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా

9 Jan, 2023 13:44 IST|Sakshi

తనపై ఉన్న ముద్దు కేసును కొట్టివేయాలంటూ బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పా శెట్టి కోర్టు మెట్లు ఎక్కింది. 2007లో తనపై నమోదైన ఈ ముద్దు కేసుపై రీసెంట్‌గా ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ కేసును కొట్టివేయాలని శిల్పా తరపు న్యాయవాది మధుకర్ దాల్వీ కోర్టును కోరారు. లాయర్‌ మధుకర్‌ వాదన విన్న హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేసు పటిషనర్‌ పూనంచంద్ భండారి నాలుగు వారాల్లో తమ సమాధానం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. వివరాలు.. 2007లో శిల్పా శెట్టిని ఓ హాలీవుడ్‌ నటుడు పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న సంఘటన అప్పట్లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్‌!

2007 ఏప్రిల్ 15న ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్‌ అవగాహ కార్యక్రమంలో శిల్పాశెట్టి, నటుడు రిచర్డ్‌ గేరితో పాటు తదితర నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిచర్డ్‌ గేరిని శిల్పా చేతులు పట్టుకుని స్టేజ్‌పైకి తీసుకువెళుతుంది. అనంతరం రిచర్డ్‌.. శిల్పాను హగ్‌ చేసుకుని ఆమెపై ముద్దు వర్షం కురిపించాడు. అప్పట్లో ఈ సంఘటన సినీ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు శిల్పాను విమర్శస్తూ పలు సామాజిక సంఘాలు మండిపడ్డాయి. ఇక పూనంచంద్ భండారి అనే వ్యక్తి శిల్పా, రిచర్డ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టులో పటిషన్‌ వేశాడు.

చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్‌

అయితే.. 2011లో తనపై ఉన్న కేసును ముంబైకి బదిలీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరింది. శిల్ప పిటిషన్ కి పర్మిషన్ ఇస్తూ.. కేసును ముంబైకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. అయితే.. శిల్పపై ఉన్న రెండు నేరాలలో ఒకదాంట్లో నిర్దోషిగా తేలింది. ఇక రెండో నేరంపై కేసు ఇంకా నడుస్తోంది. శిల్ప తరపున మధుకర్ దాల్వీ, లాయర్.. అవచాట్ సింగిల్ బెంచ్ ముందు వాదించారు. దాల్వీ వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు వేసిన ఫిర్యాదుదారుడు పూనంచంద్ భండారితో పాటు స్టేట్ గవర్నమెంట్ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు