Game Of Thrones: గుడ్ న్యూస్‌.. త్వరలో 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌' 9వ సీజన్‌ !

17 Jun, 2022 19:04 IST|Sakshi

గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌.. వరల్డ్‌వైడ్‌గా అత్యధిక పాపులారిటీ పొందిన టీవీ షో. ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న ఈ షోకు అభిమానులు అనేకం. ఇందులోని నటినటుల యాక్టింగ్‌, పోరాట ఘట్టాలు, ఎమోషన్స్‌, రిలేషన్స్‌, విజువల్స్‌, డ్రాగెన్స్‌, వైట్ వాకర్స్‌ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. హెచ్‌బీవో నిర్మించిన ఈ టీవీ షో 8 సీజన్లతో ముగించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందులోను సూపర్బ్‌గా అలరించిన 7 సీజన్లతో పోల్చుకుంటే 8వ సీజన్‌ ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసింది. దీంతో చాలా మంది హర్ట్‌ అయి.. తమకు సీక్వెల్‌ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫ్యాన్స్‌కు హెచ్‌బీవో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. డేనెరియస్‌ టార్గారియస్‌ (ఎమిలీ క్లార్క్‌)ను హీరో జాన్‌ స్నో (కిట్‌ హరింగ్టన్‌) హత్య చేసిన తర్వాత వెస్టెరోస్‌ను వదిలి నార్త్‌ ఆఫ్‌ ది వాల్‌కు ప్రయాణంచడంతో 8వ సీజన్‌ ముగుస్తుంది. ఈ ముగింపు ప్రేక్షకులకు ఎవరికీ అంతగా రుచించలేదు. దీంతో తన అసలు పేరు ఏగాన్‌ చటార్గారియస్‌ అని తెలుసుకున్న జాన్ స్నో పాత్రతో సీక్వెల్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా కిట్ హరింగ్టన్‌ను హెచ్‌బీవో సంస్థ సంపద్రించినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై హెచ్‌బీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..
కాలేజ్‌లో డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్‌..
డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు

ఇదంతా నిజమై వచ్చే 9వ సీజన్‌లో డేనెరియస్‌ టార్గారియస్‌/మదర్‌ ఆఫ్‌ డ్రాగెన్‌ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌ హౌస్‌ ఆఫ్‌ డ్రాగెన్‌ తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో టార్గారియన్‌లోని అంతర్యుద్ధం చుట్టూ కథ ఉంటుందట. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్‌ వాకర్స్‌ ఆవిర్భావం తదితర అంశాలకను చూపించే అవకాశం ఉందని సమాచారం. 

మరిన్ని వార్తలు