Singer KK Last Video: నిర్వహణ లోపంతోనే సింగర్‌ కేకేను కోల్పోయాం..

1 Jun, 2022 11:29 IST|Sakshi

KK Demise: KK Sweating Badly At Concert Video Goes Viral: ప్రముఖ సింగర్‌ కేకే (కృష్ణకుమార్‌ కున్నత్‌) మృతిపై పోలీసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే.. కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. కోల్‌కతా నజ్రుల్‌ మంచాలోని గురుదాస్‌ కాలేజ్‌ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు కేకే. అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్‌ హాల్‌. ఫ్యాన్‌, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే ఇబ్బందిపై ఫిర్యాదు కూడా చేశారు. 

అయినా నిర్వాహకులు సరిగా స్పందించలేదు. దీంతో ఇబ్బంది పడుతూనే ఆయన గంటపాటు ప్రదర్శన పూర్తి చేశారు. ఆ తర్వాత హోటల్‌ ఒబెరాయ్‌ గ్రాండ్‌కు చేరుకుని ఛాతీలో భారంగా ఉందని తన సిబ్బందికి తెలిపారాయన. అలా చెబుతూనే కుప్పకూలిన ఆయన్ని.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటుతోనే మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని  సీఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఉంచారు. శవ పరీక్ష పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలిసేది. 

చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్ష‍్యమే కారణంగా ఎత్తిచూపుతున్నారు. 'అక్కడ ఏసీ లేదు. వేడి, డీహైడ్రేషన్‌ వల్లే స్ట్రోక్స్‌, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి' అని ఒక అభిమాని ట్వీట్‌ చేశాడు. 'ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం' అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. 

చదవండి: సింగర్‌ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..​

మరిన్ని వార్తలు