‘ప్రేమ దేశం’ హీరో వినీత్‌ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యాడంటే..

5 Jun, 2021 16:09 IST|Sakshi

తెలుగు వెండితెరపై చాలా మంది హీరోలు ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుస సినిమాలు ప్లాపులు రావడంతో హీరోగా నిలదొక్కుకోలేనివాళ్లు చాలా మంది ఉన్నారు.  కానీ కొందరు మాత్రం ఎంట్రీతోనే హిట్‌ కొట్టి, తక్కువ సమయంలోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకొని, అంతే తొందరగా కనుమరుగై పోతున్నారు. ఆ కోవకు చెందిన వారే హీరో వినీత్‌. ‘ప్రేమ దేశం’సినిమాతో తెలుగులో ఒక్కసారి ఉప్పెనలా లేచిన హీరో వినీత్‌.  

సరిగమలు అనే మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ప్రేమదేశం(1996)తో ఆయనకు స్టార్‌డమ్‌ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూసిన తర్వాత అప్పటి యువకులు హెయిర్‌ స్టైల్‌ నుంచి డ్రెస్సింగ్‌ స్టైల్‌ వరకు చాలా విషయాలను ఫాలో అయ్యారు.

ఈ సినిమాతో హీరో వినీత్‌ తెలుగింటివాడైపోయాడు. ఆ క్రేజ్‌తోనే తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేశాడు వినీత్‌. కానీ హీరోగా ఎక్కువకాలం నిలబడలేకపోయాడు. సినీ బ్యాగ్రౌండ్‌(నటి శోభన కజిన్‌ ) ఉన్నప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో హీరోగా అవకాశాలు పొందలేకపోయాడు. దానికి కారణం..వినీత్‌కు తెలుగు భాషపై పట్టులేకపోవడం. 

స్వతహాగా మలయాళి అయిన వినీత్‌కు తెలుగు భాష పై పెద్దగా పట్టు లేదు. రాజశేఖర్, భానుచందర్, సుమన్ మాదిరిగా డబ్బింగ్ చెప్పుకోవడానికి వీలునప్పటికీ..  క్లాస్ పాత్రలు తప్ప మాస్ పాత్రలకు సరిపోలేదు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన వినీత్ కి లవర్ బాయ్, డాన్సర్ కథలు మాత్రమే ఎక్కువగా వచ్చేవి. అవి బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడంతో వినీత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.  ప్రేమ పల్లకి, ఆరో ప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. 

దీంతో చివరకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారి లాహిరి లాహిరి లాహిరిలో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి మూవీస్ లో నటించాడు. అదే సమయంలో మలయాళంలో హిట్స్ రావటంతో తెలుగులో ఆఫర్ తగ్గిపోయాయి. మలయాళంలో వరుస అవకాశాలు రావడంతో టాలీవుడ్‌ వైపు చూడలేదు వినీత్‌.

2006 థాంక్స్ సినిమా తరువాత ఎక్కువగా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇటీవల నితిన్‌ హీరోగా నటించిన రంగ్ దే(2021) మూవీలో కనిపించాడు. మంచి పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించనని వినీత్‌ భావిస్తున్నారట. చూద్దాం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానైనా వినీత్‌కి తెలుగులో మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం. 
చదవండి:
నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా!
హీరో అబ్బాస్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా!

మరిన్ని వార్తలు