ఆటో రజిని హిట్‌ అవ్వాలి

4 Oct, 2021 04:53 IST|Sakshi
నందిగం సురేష్, కొడాలి నాని, జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్‌ గుప్తా, జొన్నలగడ్డ శ్రీనివాస్‌

– మంత్రి కొడాలి నాని

‘‘ఆటో రజిని’ సినిమా మంచి విజయం సాధించి, మా జొన్నలగడ్డ శ్రీను కుటుంబానికి మంచి లాభాలు రావాలి. చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి పేరు రావాలి. హీరో, హీరోయిన్‌తో పాటు నటీనటులు పదికాలాలపాటు ఇండస్ట్రీలో వెలుగొందాలి’’ అని ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్‌ గుప్తా జంటగా జొన్నలగడ్డ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్‌ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ర్‌పైజెస్‌ పతాకాలపై జొన్నలగడ్డ సావిత్రి నిర్మిస్తున్న ‘ఆటో రజిని’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్‌ చేయగా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ క్లాప్‌ కొట్టారు.

మధుసూదన్‌ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, గౌతమ్‌ రెడ్డిలు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ హరికృష్ణని మంచి హీరోగా నిలబెట్టే చిత్రం అవుతుంది’’ అన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ సినిమాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్‌ అండ్‌ యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 15 నుంచి విజయవాడలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ‘‘మంచి సందేశంతో ‘ఆటో రజిని’ రూపొందుతోంది’’ అన్నారు సావిత్రి.జె. ‘‘నా మొదటి చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ ఆడియోకి వైఎస్‌ జగనన్న ఆశీస్సులు తీసుకున్నాను. ‘ఆటో రజిని’ ఒక మాస్‌ సినిమా’’ అన్నారు హరికృష్ణ. ‘‘నా మొదటి చిత్రాన్ని తెలుగులో చేయడం సంతోషం’’ అన్నారు ప్రీతి సేన్‌ గుప్తా. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్‌ రెడ్డి.


 

మరిన్ని వార్తలు