Katrina Kaif: పెళ్లిరోజు తొలిరాత్రి ముచ్చట తీరదన్న ఆలియా, షాకింగ్‌ ఆన్సరిచ్చిన కత్రినా

6 Sep, 2022 20:46 IST|Sakshi

సెలబ్రిటీల సీక్రెట్స్‌ను బయటపెట్టే షో "కాఫీ విత్‌ కరణ్‌". హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ తారలతో మాటలు కలుపుతూ వారి గురించి అన్ని విషయాలు రాబడుతుంటాడు. సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ను తెలుసుకోవాలనుకునే ఫ్యాన్స్‌ ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కాఫీ విత్‌ కరణ్‌ ఏడో సీజన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. తాజాగా ఈ షోకు ఫోన్‌ బూత్‌ చిత్రయూనిట్‌ సిద్దాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌, కత్రినా కైఫ్‌ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది.

ఇందులో కరణ్‌.. 'పెళ్లిరోజు అలిసిపోతాం, కాబట్టి ఆరోజు శోభనం ఉండదు' అన్న ఆలియా సమాధానాంపై స్పందనేంటని అడిగాడు. దీనికి కత్రినా.. మా శోభనం పగలు జరిగింది అని షాకింగ్‌ ఆన్సరిచ్చింది. ఇక సిద్దాంత్‌ చతుర్వేదిని సింగిలా? కమిటెడా? అని అడిగాడు. దానికతడు ఇప్పటికీ బ్రహ్మచారినేనని ఆన్సరిచ్చాడు. ఆమధ్య అనన్య పాండేతో తెగదెంపులు చేసుకున్న ఇషాన్‌ ఖట్టర్‌ కూడా తాను ఏ రిలేషన్‌లో లేనని క్లారిటీ ఇచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్‌ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ పెళ్లి చేసుకున్నారు.

చదవండి:బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు.. కానీ అంతా తలకిందులయ్యేలా ఉందే!
లలిత్‌ మోదీకి సుష్మిత బ్రేకప్‌?!

మరిన్ని వార్తలు