తమిళ్‌, తెలుగులో నాన్‌ యార్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం

22 Sep, 2022 14:56 IST|Sakshi

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలు కోలీవుడ్‌లో మినిమం గ్యారెంటీగా మారాయి. దీంతో ఈ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా రపొందుతున్న నాన్‌ యార్‌ చిత్రం ఈ కోవకే చెందుతుంది. కౌశల్‌ క్రియేషన్స్‌ పతాకంపై భీమినేని శివప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, బాధ్యతలను నిర్జన్‌ పల్నాటి నిర్వహిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్‌ కోలా భాస్కర్‌ వారసుడు కోలా బాలకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి సాక్షి చౌదరి నాయకి. బాహుబలి ప్రభాకర్, తనిష్క్‌ రాజన్, నీరజా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఆర్జే శక్తి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్‌ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం అని చెప్పారు. నిత్యం జరిగే హత్యల వార్తలను పత్రికల్లో హెడ్‌లైన్‌లో చూస్తుంటామన్నారు. అలాంటి వాటి గురిం చిత్ర కథానాయకుడు అనలైజ్‌ చేస్తుంటాడని, అలాంటి సమయంలో అతని ప్రేయసిని ఒక ముఠా కిడ్నాప్‌ చేస్తారని చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్‌ చేస్తుండగా మరో పక్క కథానాయకుడు తన ప్రేయసి కోసం వెతుకుతుంటారన్నారు. ఇలా పలు ఆసక్తికరమైన సంఘటనలతో రెండు కోణాల్లో జరిగే కథే నాన్‌ యార్‌ చిత్రం అని చెప్పారు.

మరిన్ని వార్తలు