మద్రాసు హైకోర్టులో విజయ్‌కు ఊరట

17 Aug, 2022 20:44 IST|Sakshi

చెన్నై: ఆదాయ పన్ను శాఖ కేసు నుంచి తమిళ నటుడు విజయ్‌కు ఊరట లభించింది. జరిమానా చెల్లింపు నిమిత్తం ఐటీ అధికారులు దాఖలు చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మంగళవారం స్టే విధించింది. నటుడు విజయ్‌ 2016–17లో  తన ఆదాయం రూ. 35.42 కోట్లుగా ఐటీ లెక్కలను చూపించినట్లు సమాచారం. ఆ తదుపరి పరిణామాలతో విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ లెక్కల్లో విజయ్‌ తాను నటించిన  ‘పులి’ చిత్రం రెమ్యునరేషన్‌ రూ. 15 కోట్లను చూపించనట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

దీంతో రూ. 1.50 కోట్లు జరిమానా విధించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2017లో ఐటీ సోదాలు జరిగితే 2019లో జరిమానా విధించడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను తప్పు చేసి ఉంటే, ముందుగానే నోటీసులు ఇచ్చి ఉండాలన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి అనితా సుమంత్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. వాదనల అనంతరం ఆలస్యంగా జరిమానాకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 

చదవండి: First Day First Show Movie: పవన్‌ కల్యాణ్‌ని వాడుకున్నాం.. సర్‌ప్రైజింగ్‌ ఉంటుంది

మరిన్ని వార్తలు