డార్క్‌ కామెడీ నేపథ్యంలో.. ‘స్వప్న సుందరి’

6 Sep, 2022 20:06 IST|Sakshi

తమిళ సినిమా: భారతీయ చిత్రాలను విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్న ప్రముఖ సంస్థ హంసిని ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ, వ్యూ బాక్స్‌ స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం స్వప్న సుందరి. నటి ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి లక్ష్మీ ప్రియ, దీపా శంకర్, కరుణాకరన్, రెడిన్‌ కింగ్స్‌ లీ, మైమ్‌ గోపి, సునీల్‌ రెడ్డి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. లాకప్‌ చిత్రం ఫేమ్‌ ఎస్‌జీ చార్లెస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలమురుగన్, విఘ్నేష్‌ రాజగోపాలన్‌ ద్వయం ఛాయగ్రహణం, అజ్మల్, శివాతి్మక ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.

చిత్ర వివరాలను తెలుపుతూ.. డార్క్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న వైవిధ్య భరిత కథాచిత్రం ఇదని చెప్పారు. నటి ఐశ్వర్య రాజేష్‌ తొలిసారిగా హాస్య భరిత పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. డార్క్‌ కామెడీ కథా చిత్రాలు తమిళ సినిమాకు పరిచయమేనని ఆ తరహాలో వస్తున్న మరో విభిన్న కథా చిత్రం స్వప్న సుందరి అని తెలిపారు. చిత్ర టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని చెప్పారు. షూటింగ్‌ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు