బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఛాలెంజ్‌:అసలు దీని ఉద్ధేశ్యమేంటీ!

29 Jul, 2020 10:14 IST|Sakshi

సవ్యంగా సాగుతున్న జీవితాల్లో ఊహించిన మలుపులా దూసుకొచ్చింది కరోనా వైరస్‌.  ఎంతో మంది జీవితాలను ఈ మహమ్మారి అతాలకుతలం చేసింది. కరోనా ధాటికి అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. కొన్ని కొత్త  సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్‌ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కొత్త ఫిట్‌నెస్‌, వంటలు, కొత్త వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటూ తమ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. (సోనూసూద్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?)

ఈక్రమంలో కొన్ని ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. అలా వచ్చిందే ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఛాలెంజ్’‌. ఎప్పుడూ కలర్‌ ఫుల్‌ ఫోటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫోటోలను womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే ఈ ఛాలెంజ్‌. దీని ద్వారా మహిళలు తమలోని ఆత్మ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సాధికారికతను పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ ఛాలెంజ్‌ నడుస్తోంది. ఈ సవాల్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోలీవుడ్‌ తారలపై ఓ లుక్కేద్దాం. (పెళ్లికి రెడీ అవుతోన్న‌ 'ప‌హిల్వాన్' విల‌న్)

1... సునయన
సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎంచుకున్న పాత్రల్లో తన అద్భుతమైన నటన నైపుణ్యాలను నిరూపించుకుంది. తన స్నేహితురాలు, నటి మంజిమా మోహన్ ఇచ్చిన సవాలును అంగీకరించిన సునాయన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాన్ని పంచుకుంది. సునైనా సాదా చీరతో, తక్కువ అభరణాల అలంకరణ ఆమెకు సరిగ్గా సరిపోయింది.

2. మంజిమా మోహన్
తమిళ నటుడు శింబు సరసన రొమాంటిక్ థ్రిల్లర్ 'అచ్చం యెన్‌భాధు మదమైయాడ' చిత్రంలో నటించిన మంజిమా మోహన్ తన  నటనకతో  ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించుకుంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలతోపాటు పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించింది. నటి వరలక్ష్మి చేసిన సవాలును అంగీకరించిన మంజిమా  బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌లో ఫోటోను షేర్‌ చేసింది.

3. వరలక్ష్మీ
సినీ పరిశ్రమలో ధైర్యవంతులైన నటీమణులలో వరలక్ష్మి ఒకరు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టదినట్లు మాట్లడటంలో ఆమె ఎన్నడూ వెనకాడదు. మహిళలపై  లైంగిక వేధింపుల కోసం పోరాడటానికి వరలక్ష్మి ఒక ప్రచారాన్ని కూడా నడుపుతుంది. తాజాగా ఈ సవాలను స్వీకరించిన వరలక్ష్మీ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతేగాక లాక్ డౌన్ సమయంలో ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

4. నివేధిత సతీష్
'మాగలీర్ మాట్టం', 'సిల్లు కరుపట్టి' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నివేదిత సతీష్ తన పాత్రలతో అబ్బురపరిచింది. బోల్డ్‌ పాత్రలు స్వీకరించే నటీమణులలో నివేదిత ఒకరు. ఆమెకున్న పెద్ద కళ్ళు తనకు ప్లాస్‌ పాయింట్‌గా చెప్పుకుంటారు.  ఆమెకు బాగా సరిపోయే చీరతో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 

5.  సుజా వరుణీ
సుజా వరుణీ 2018లో శివ కుమార్‌ను వివాహం చేసుకున్నారు, ఈ జంటకు గత ఏడాది (2019) ఆగస్టులో పండంటి మగబిడ్డ జన్మించాడు. సుజా వరుణీ అనేక పాపులర్ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది, అయితే టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ నటికి మరింత ఖ్యాతి వచ్చింది. మహిళల ఛాలెంజ్‌కు మద్దతు ఇచ్చే మహిళల్లో సుజా వరుణీ ఒకరు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన, ఆమెతన గతంలో దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను పంచుకున్నారు.

6.. అక్షర హాసన్‌
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్.  అయితే వారసత్వ నటిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.  ప్రస్తుతం నవీన్ దర్శకత్వం వహించే 'అగ్ని సిరగుగల్' చిత్రంలో అక్షర ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సవాలును స్వీకరించిన అక్షర బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

మరిన్ని వార్తలు