టైం ట్రావెల్‌ చేయనున్న కమెడియన్‌.. ఏకంగా రూ.50లక్షల ఖర్చుతో..!

21 May, 2022 06:54 IST|Sakshi

తమిళసినిమా: టైం ట్రావెల్‌ చేయడానికి యోగిబాబు సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో టైం ట్రావెల్‌ కథాంశంతో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో యోగిబాబు కథానాయకుడిగా చేయనున్నారు.

దీనికి పెరియాండవర్‌ అనే పేరును నిర్ణయించినట్లు దర్శకుడు తెలిపారు. యోగిబాబు శివుడిగా నటించనున్నట్లు చెప్పారు. నాయకిగా ఒక ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. చిత్రం కోసం వీసీఆర్‌ రోడ్డులో రూ.50లక్షలతో శివాలయం సెట్‌ను వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

చదవండి: Adivi Sesh: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన అడివి శేష్‌

మరిన్ని వార్తలు