బాలల ఇతివృత్తంతో ‘ఎరుంబు’

11 Nov, 2022 21:22 IST|Sakshi

కోలీవుడ్‌లో బాలల ఇతివృత్తంతో రూపొందిన చిత్రాలు వచ్చి చాలా కాలం అయిందని చెప్పాలి. ఆ గ్యాప్‌ను పూర్తి చేసేలా తాజాగా ఎరుంబు అనే చిత్రం రూపొందుతోంది. మండ్రు జీవీఎస్‌ ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్‌ జి.దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, కనా చిత్రాల ఫేమ్‌ మౌనిక శివ, సింగిల్, మాస్టర్‌ చిత్రాలు ఫేమ్‌ శక్తి రిత్విక ప్రధాన పాత్రలు పోషించగా, నటుడు చార్లీ, ఎంఎస్‌ భాస్కర్, జార్జ్‌ మరియన్, నటి సృజన్‌ తదితరులు నటించారు. కేఎస్‌ కాళిదాస్‌ చాయాగ్రహణం, అరుణ్‌రాజ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఇది అక్క,తమ్ముళ్ల అనుబంధాలు ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల  బాలుడికి ఏర్పడిన సమస్యను వారు ఎలా ఎదుర్కొన్నారు? దాని నుంచి వాళ్లు బయటపడ్డారా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఎ రుంబు ఉంటుందని ఆయన తెలిపారు. చిన్న పి ల్లల ఆటలు, పాటలు, చిలిపి చేష్టలు వంటి సంఘటనలతో పాటు ఒక ము ఖ్యమైన సమస్య గురించి చెప్పే చిత్రంగా ఇది ఉంటుందని తెలిపారు. చిత్ర ఫస్ట్‌ పోస్టర్, లుక్‌ సింగిల్‌ ట్రాక్‌లను ఇటీవల విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చిందన్నారు. ఇందులో సంగీత దర్శకుడు శాన్‌ లో ల్డన్, ప్రదీప్‌లు చెరో పాటను పాడటం విశేషమని తెలిపా రు.   త్వరలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.    

మరిన్ని వార్తలు