Goundamani: సీనియర్‌ కమెడియన్‌ రీ ఎంట్రీ ? స్వయంగా హీరోనే ఇంటికి వెళ్లి అడగడంతో..

18 Jul, 2022 21:30 IST|Sakshi

తమిళసినిమా: సీనియర్‌ హాస్యనటుడు గౌండ్రమని రీ ఎంట్రీ షురూ అయిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఈయనకు దర్శకుడు భారతీరాజా 16 వయదినిలే చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడి పాత్రను ఇచ్చి ఆయన దశ తిరిగేలా చేశారు. ఆ తరువాత ప్రముఖ కమెడియన్‌గా ఎదిగి కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించారు.

ముఖ్యంగా గౌండ్రమని, సెంథిల్‌ జంట వినోదాల విందే అని పేరు తెచ్చుకున్నారు. అలా కోలీవుడ్‌లో గౌండమని హవా 2000 ఏడాది వరకు వెలిగింది. ఆ తరువాత చిత్రాల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన చివరగా 2016లో వాయ్మ్‌ అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈయన తాజాగా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో మావీరన్‌ ఒకటి. మడోనా అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌కు మహావీరుడు అనే టైటిల్‌ ఖరారు చేశారు. కాగా ఇందులో నటుడు గౌండ్రమని హాస్య పాత్రలో నటించనున్నారని తెలిసింది. నటుడు శివకార్తికేయన్‌ స్వయంగా గౌండ్రమని ఇంటికి వెళ్లి ఆయనను నటించమని కోరారట.

చదవండి: Divya Bharathi: బికినీ ఫొటోషూట్‌తో 'బ్యాచ్‌లర్‌' హీరోయిన్‌ రచ్చ..

మరిన్ని వార్తలు