'16 ఏళ్లుగా చేధించలేని కేసు'.. ఆసక్తిని రేకెత్తిస్తున్న డైరీ చిత్రం

29 Aug, 2022 10:18 IST|Sakshi

తమిళసినిమా: అరుళ్‌నిధి వరుస చిత్రాల్లో నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు. గతంలో ఆయన నటించిన ది బ్లాక్, డెజావు చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. తాజాగా అరుళ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం డైరీ. ఫైవ్‌స్టార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై కదిరేశన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఇన్నిసై పాండియన్‌ దర్శకత్వం వహించారు. అరుళ్‌ నిధి ఇందులో పోలీసు అధికారిగా నటించారు. ట్రైనీ పోలీసులకు కేసులను పై అధికారి అప్పగించడంతో చిత్ర కథ ప్రారంభమవుతుంది.

పెండింగ్‌లోని కేసులను పరిష్కరించే బాధ్యతలను ఆ అధికారి ట్రైన్‌ పోలీసులకు అప్పగిస్తారు. అలా గత 16 ఏళ్లుగా చేధించలేని కేసును హీరో అరుళ్‌నిధి చేపడుతారు. దానిని ఆయన ఎలా చేధించాడు అన్నదే డైరీ చిత్ర కథ. పలు ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రంలో అనేక అనూహ్య సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. భూత, భవిష్యత్తు కాలాలు మన పక్కనే ఉంటాయి.

అయితే అవి ఎవరి కంటికి కనిపించవు. అలా కనిపిస్తే ఏమౌతుందన్నదే డైరీ చిత్ర కథ. యాక్షన్‌తో కూడిన ఇన్వెస్టిగేషన్‌ సన్నివేశాలతో కూడిన కథను దర్శకుడు హార్రర్‌ను జోడించి మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేశాడు. అరుళ్‌నిధి పాత్రను ఆయన గత చిత్రాలకు భిన్నంగా రూపొందించారు. అరుళ్‌నిధి అద్భుతంగా నటించారు. క్లైమాక్స్‌ ఆసక్తిగానూ, ఉద్రేక భరితంగా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.  

మరిన్ని వార్తలు