అజిత్‌ 'ఏకే63'.. టాలీవుడ్ అగ్ర నిర్మాతకే బాధ్యతలు!

29 Nov, 2023 09:30 IST|Sakshi

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్‌బైజాన్‌లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్‌ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్‌కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్‌ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు