Kollywood Suriya: ఒక్క ట్వీట్‌తో పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టిన సూర్య

29 May, 2022 12:58 IST|Sakshi

తమిళసినిమా: బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపై వస్తున్న పుకార్లకు నటుడు సూర్య ఫుల్‌స్టాప్‌ పెట్టారు. వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటుడు సూర్య ప్రస్తుతం ఈయన వెట్రీమారన్‌ దర్శకత్వంలో వాడి వాసల్, బాలా దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆగిపోయిందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనికి క్లారిటీ ఇస్తూ బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు రెండవ షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూర్య తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. పితామగన్, నందా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూర్య, బాలా కలిసి 17 ఏళ్ల తరువాత చేస్తున్న చిత్రం ఇది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.
 

  

మరిన్ని వార్తలు