‘ఇంతకంటే గొప్ప కాంబినేషన్‌ను ఊహించలేను, వాళ్లతో పని చేయడం నా అదృష్టం’

3 Apr, 2022 16:50 IST|Sakshi

తమిళసినిమా: అసాధారణ నటీనటులతో పని చేశాను.. అందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అని దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్నారు. నటుడు విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార కలిసి నటించిన చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్‌. నిర్మాత లలిత్‌కుమార్‌ సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ కోసం నయనతార, విఘ్నేష్‌ శివన్‌ రౌడీపిక్చర్స్‌ సంస్థ ఫస్ట్‌కాపీ బేస్‌లో నిర్మించిన చిత్రం ఇది. దీనికి నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు.

అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పాట చిత్రీకరణతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు ట్విట్టర్లో చిత్ర ఫొటోలను పోస్టు చేసి దీన్ని సాధ్యం చేసిన భగవంతుడికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అసాధారణ నటీ నటులతో పని చేశానని, అలాంటి వారు దొరకడం నా అదృష్టం, ఒక దర్శకుడికి కలే అని అన్నారు. ఇంతకంటే గొప్ప కాంబినేషన్‌ను ఊహించలేనన్నారు. ఉత్తమ నటుడు విజయ్‌సేతుపతి, అందమైన ప్రొఫెషనల్‌ నటి నయనతార, ప్రతిభావంతమైన నటి సమంత వీళ్లంతా ఈ చిత్రాన్ని అద్భుతంగా నడిపించారని అన్నారు. చిత్రాన్ని ఈనెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

చదవండి: Sai Pallavi : కూలీగా మారిన స్టార్‌ హీరోయిన్‌.. ఫోటో వైరల్‌

మరిన్ని వార్తలు