Kondaveedu Movie Review: ‘కొండవీడు’ మూవీ రివ్యూ

9 Jul, 2022 11:54 IST|Sakshi

టైటిల్‌ : కొండవీడు 
నటీనటులు : శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ తదితరులు 
నిర్మాతలు: మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి
రచన,దర్శకత్వం: సిద్ధార్థ్ శ్రీ
సంగీతం : కనిష్క
సినిమాటోగ్రఫీ: రఘు రాయల్
ఎడిటర్‌: శివ శర్వాణి
విడుదల తేది: జులై 8, 2022


‘కొండవీడు’ కథేంటంటే..
కొండవీడు అటవీ ప్రాంతానికి చెందిన బాకు బాబ్జీ(ప్రతాప్‌ రెడ్డి) అడవిలోని చెట్లను నరుకుతూ కలప స్మగ్లింగ్‌ చేస్తుంటాడు. అతని చీకటి వ్యాపారానికి అడ్డొచ్చిన ఫారెస్ట్‌ అధికారులను చంపుతూ.. కంటపడిన ఆడపిల్లలపై హత్యాచారానికి పాల్పడుతుంటాడు. అతని అగడాలను అట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రొఫెసర్‌కు వంశీకృష్ణ, సామావేద (శ్వేతా వర్మ) కలుస్తారు. అసలు బాకు బాజ్జీ అక​‍్రమాలను ప్రొఫెసర్‌ ఎందుకు అడ్డుకొంటాడు? అడవిలోకి వంశీకృష్ణ, సామావేద ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వంశీ, సామవేదల ప్రేమ ఎక్కడికి దారి తీసింది? బాకు బాబ్జి చేతికి చిక్కిన ఈ ముగ్గురు.. ఎలా బయటపడ్డారు? బాకుల బాబ్జీ అక్రమాలను ఎవరు చెక్‌ పెట్టారు? అనేదే ‘కొండవీడు’ కథ.

ఎలా ఉందంటే..?
అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అక్రమ రవాణా నేపథ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన చిత్రం `కొండవీడు' ప్రకృతికి హాని కలిగించే కలప స్మగ్లర్లకు గుణపాఠం చెబుతూనే ప్రేక్షకులను కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌  అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సిద్ధార్థ్‌ శ్రీ. చెట్లను నరుక్కుంటూ పోతే సహజంగా దొరికే ఆక్సిజన్‌ను లక్షల రూపాయలు పెట్టి కొనే దుస్థుతి వస్తుందనే సందేశాన్ని ప్రేక్షకులు అందించాడు.

అయితే ఈ కథను పూర్తిస్తాయిలో విస్తరించి, తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకొని ఉండే సినిమా స్థాయి మరోలా ఉండేది. సినిమాలో చాలావరకు కొత్త నటులే అయినా..వారిని నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. తొలి సినిమా అయినా.. చాలా నిజాయితీగా మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అడవి సంపద, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తెలిసిన వారికి ‘కొండవీడు’ నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ శ్వేతా వర్మ. సామావేద పాత్రకి ఆమె న్యాయం చేసింది. గ్లామర్ పరంగా, హావ భావాల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో శ్వేతా వర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కలప స్మగ్లర్‌ బాకు బాబ్జీగా ప్రతాప్ రెడ్డి నేచురల్‌గా విలనిజం ప్రదర్శించాడు.వంశీకృష్ణగా శ్రీకృష్ణ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ పండించే ఆస్కారం దొరికింది. మిగిలిన నటీనటులు కొత్తవారే అయినా.. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విషయానికొస్తే..కనిష్క సంగీతం బాగుంది. ‘ఎదలో జరిగే ప్రణయాన్ని ఎలా ఆపడం’ అనే పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ రఘు రాయల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.శివ సర్వాణి ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు